కరోనా నుంచి కోలుకున్న హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి

గురుగ్రామ్ : హర్యానా హోం, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ కరోనా నుంచి కోలుకున్నారు. గత 20 రోజులుగా గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం కాస్త మెరుగుపడటంతో బుధవారం వైద్యులు అనిల్ విజ్‌ను ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చారు. ‘దేవుడి దయ వల్ల కోలుకున్నాను. ప్రజల ప్రార్థనలు ఫలించాయి. ఐసీయూ నుంచి నన్ను వైద్యులు సాధారణ గదికి మార్చారు. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ విజ్ ట్వీట్ చేశారు.
భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ (కరోనా వ్యాక్సిన్) మూడో విడుత ట్రయల్స్‌కు ఆయన రాష్ట్రంలో మొట్టమొదటి వలంటీర్‌గా వ్యవహరించారు. నవంబర్ 20న అంబాలా ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి అనిల్ విజ్ కొవాగ్జిన్ టీకా తీసుకున్నారు. అనంతరం 15 రోజుల తరువాత (డిసెంబర్ 5న) కొవిడ్-19 వైరస్ బారినపడ్డారు. నాటి నుంచి ఆయన దవాఖానలోనే చికిత్స పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి..
తృణమూల్‌లో చేరిన భార్యకు బీజేపీ ఎంపీ విడాకుల నోటీసు
4 లక్షల బ్యాగును ఎత్తుకెళ్లి.. నోట్లను వెదజల్లిన కోతి
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కిసాన్ ర్యాలీ భగ్నానికి ఉగ్ర కుట్ర
- రాజ్యాంగం అసలు కాపీని ఆ బాక్స్‌లో ఎందుకు ఉంచారో తెలుసా?
- ఎగిరే బల్లి..పొలంలో అలజడి
- ట్రంప్ కొత్త పార్టీ పెట్టడం లేదు..
- ఈ 'కుక్క' మాకూ కావాలి
- చైనాలో ఇంటర్నెట్ స్టార్ గా మారిన 4ఏళ్ల చిన్నారి, స్పేస్ సూట్ లో పీపీఈ కిట్
- కరోనా టీకా తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్
- మురికివాడలో మెరిసిన ముత్యం..సెలబ్రిటీలను ఫిదా చేసిన మలీషా
- అమెరికాలో కాల్పులు.. గర్భిణి సహా ఐదుగురు మృతి
- వ్యవసాయ చట్టాలతో రైతులపై ప్రధాని దాడి: రాహుల్‌గాంధీ