Processed Food | ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నారా.. అయితే అకాల మరణం పొంచిఉన్నట్టే!
రుచిగా ఉన్నాయని చిప్స్, స్నాక్స్, మ్యాగీ వంటి పదార్థాలు తింటున్నారా? హాయిగా, చల్లగా ఉన్నాయని ఫిజీ డ్రింక్స్, కూల్డ్రింక్స్ వంటివి తాగుతున్నారా? అయితే మీరు ఆయుక్షీణం కొని తెచ్చుకున్నట్టే లెక్క.
Processed Food | న్యూఢిల్లీ, మే 9: రుచిగా ఉన్నాయని చిప్స్, స్నాక్స్, మ్యాగీ వంటి పదార్థాలు తింటున్నారా? హాయిగా, చల్లగా ఉన్నాయని ఫిజీ డ్రింక్స్, కూల్డ్రింక్స్ వంటివి తాగుతున్నారా? అయితే మీరు ఆయుక్షీణం కొని తెచ్చుకున్నట్టే లెక్క. ప్రాసెస్డ్ ఫుడ్ మీ జీవితకాలాన్ని తగ్గిస్తుందని, అకాల మరణ ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 30 ఏండ్లపాటు సాగిన అధ్యయన నివేదికను బీఎంజే జర్నల్ గురువారం ప్రచురించింది.
ఆ అధ్యయనం ప్రకారం.. అధికశక్తి, ఉప్పు, కొవ్వు, చక్కెర అధికంగా ఉండే అల్ట్రాప్రాసెస్డ్ ఫుడ్ తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్లు, మినరల్స్ సరైనపాళ్లలో అందకపోవడం వల్ల మనిషి ఆరోగ్యం దెబ్బతింటుంది. అది ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రమాదాలను పెంచుతుంది. అమెరికా, బ్రెజిల్, చైనాకు చెందిన పరిశోధకులు 1984 నుంచి 2018 మధ్య 11 అమెరికా రాష్ర్టాల నుంచి 74,563 మంది మహిళా నర్సుల దీర్ఘకాలిక ఆరోగ్య రికార్డును పరిశీలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BMJ
- Lifespan
- Processed Food
- Snaks
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

