చండీగఢ్, అక్టోబర్ 4: 90 శాసనసభ స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి శనివారం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చాలా స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. హ్యట్రిక్ విజయంపై బీజేపీ కన్నేయగా, దశాబ్దం తర్వాత అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది.
ఆప్, ఐఎన్ఎల్డీ-బీఎస్పీ, జేజేపీ-అజాద్ సమాజ్ పార్టీ తమ సత్తా చాటాలని చూస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీకిరెబెల్స్ బెడద కూడా ఉంది. సీఎం నాయబ్ సింగ్ సైనీ, శాసనసభలో విపక్ష నేత భూపిందర్ సింగ్ హూడా, అభయ్ సింగ్ చౌతాలా, మాజీ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగాట్, తదితర ప్రముఖులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 8న జరగనుంది.