సీఎం ఠాక్రే Vs ఎంపీ నవనీత్.. ముంబైలో కొనసాగుతున్న హనుమాన్ చాలీసా వివాదం
Hanuman Chalisa | మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) లొల్లి ఇప్పట్లో సద్దుమనుగేలా లేదు. అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని హెచ్చరించారు. దీంతో శనివారం ఉదయం శివసేన కార్యకర్తలు ముంబైలోని
ముంబై: మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) లొల్లి ఇప్పట్లో సద్దుమనుగేలా లేదు. అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని హెచ్చరించారు. దీంతో శనివారం ఉదయం శివసేన కార్యకర్తలు ముంబైలోని ఆమె ఇంటి ముందు నిరసన తెలిపారు. మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసాను పఠిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతారవణం ఏర్పడింది.

సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసాను పఠిస్తామని ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులు హెచ్చరించారు. ఈ క్రమంలో శివసేన కార్యకర్తలు పెద్దఎత్తున ఆమె ఇంటికి చేరుకుని నిరసన తెలిపారు. కాగా, శివసేన కార్యకర్తలు తమ ఇంటిపై దాడిచేయడానికి ప్రయత్నిస్తున్నారని నవనీత్ రాణా ఆరోపించారు.

సీఎం సూచనమేరకు వారు దాడికి దిగారన్నారు. పోలీసులు తమను ఇంట్లో నుంచి బయటకు రానివ్వడం లేదని చెప్పారు. మాతోశ్రీని తాము ఒక దేవాలయంలా భావిస్తున్నామని తెలిపారు. కానీ ఉద్ధవ్ ఠాక్రేనే ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని నవనీత్ కౌర్ విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

