న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఆగస్టు నెలలో రూ.1.75 లక్షల కోట్లుగా ఉందని కేంద్రం ఆదివారం ప్రకటించింది. గత ఏడాది ఆగస్టుతో పోల్చుకుంటే వసూళ్లు 10 శాతం ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.
దేశీయ లావాదేవీల ద్వారా స్థూల జీఎస్టీ ఆదాయం 9.2 శాతం పెరిగి, రూ.1.25 లక్షల కోట్లకు చేరినట్లు, దిగుమతులపై పన్ను ఆదాయం 12.1 శాతం పెరిగి రూ.49,976 కోట్లకు చేరినట్లు వివరించింది.
ఆగస్టులో రిఫండ్స్ రూ.24,460 కోట్లు అని, ఇది గత ఏడాది కన్నా 38 శాతం ఎక్కువ అని తెలిపింది. రిఫండ్స్ను సర్దుబాటు తర్వాత నికర జీఎస్టీ రెవెన్యూ రూ.1.5 లక్షల కోట్లు అని వివరించింది.