Ludo | వివాహ వేడుకల్లో (wedding ceremony) సరదా సంఘటనలకు కొదవ ఉండదు. వధూవరులు చేసే అల్లరి, బంధువులు చేసే హడావుడి, స్టేజ్‌పై డ్యాన్స్‌లు ఇలా ఒకటేంటి ఎన్నో సరదా సంఘటనలు ఆకర్షిస్తుంటాయి. ఆయా వేడుకల్లో జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్కు సంబంధించిన వీడియోలు, ఫొటోలూ నెట్టింట తెగ ఆకర్షిస్తుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పించేవి ఉండగా.. మరికొన్ని షాకింగ్‌గా అనిపిస్తుంటాయి. తాజాగా, అలాంటిదే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరికాసేపట్లో పెళ్లి.. బంధువుల హడావుడి, పిల్లల సందడితో మండపం కలకలలాడుతోంది. పెళ్లి తంతులో భాగంగా వరుడు పీటలపై కూర్చున్నారు. ఓ వైపు పండితుడు పెళ్లి తంతును కానిస్తుండగా.. పెళ్లి కుమారుడు మాత్రం మండపంపై ఆన్లైన్ గేమ్‌లో మునిగిపోయి కనిపించాడు. వెనుక ఉన్న తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఫోన్లో లూడో (Ludo) ఆడుతూ కెమెరాకు చిక్కాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ ఫొటో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Bro has his own priorities pic.twitter.com/CEVJnfPpvb
— Muskan (@Muskan_nnn) November 27, 2024
Also Read..
Joe Biden | అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే ముందు.. కుమారుడికి బైడెన్ క్షమాభిక్ష
Vikrant Massey | నటనకు బ్రేక్.. 12th Fail హీరో సంచలన ప్రకటన
Bigg Boss Telugu 8 | బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన పృథ్వీరాజ్ శెట్టి