Bigg Boss Telugu 8 | బుల్లితెర ప్రేక్షకుల ఫేవరేట్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 13 వారాలుగా అలరిస్తున్న ఈ షో మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఈ షోకి సంబంధించి ఆదివారం వస్తుందంటే చాలు ప్రేక్షకులు టెన్షన్‌తో టీవీలకు అతుక్కుపోతారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే హౌజ్ నుంచి బేబక్కతో పాటు, శేఖర్ బాషా, అభయ్, సోనియా ఆకుల, గంగవ్వ, హరితేజ, నవీన్, టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వగా.. ఈ ఆదివారం హౌజ్ నుంచి పృథ్వి ఎలిమినేట్ అయ్యాడు.
పదమూడో వారం నామినేషన్స్‌లో 8 మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో శనివారం ఎవరు ఊహించని విధంగా హౌజ్ నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. టేస్టీ తేజ తర్వాత తక్కువ ఓటింగ్‌తో డేంజర్ జోన్లో ఉన్నాడు పృథ్వీరాజ్ శెట్టి. దీంతో తక్కువ ఓటింగ్ ఉన్న అతడు హౌజ్ నుంచి బయటకు వచ్చేశాడు. హౌజ్ నుంచి బయటకు వెళ్లిన టెస్టీ తేజ దాదాపు 8 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు. దీంతో అతడికి వారానికి రూ. 4 లక్షల చొప్పున రెండు నెలల్లో రూ.30 లక్షల పారితోషికం బిగ్ బాస్ నిర్వహాకులు ఇచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు బిగ్ బాస్ 8 తెలుగులోకి అడుగుపెట్టిన పృథ్వీరాజ్ దాదాపు 3 నెలలు హౌజ్‌లో ఉన్నాడు. 13 వారాలుగా హౌజ్‌లో ఉండి ప్రేక్షకులను అలరించిన పృథ్వీరాజ్‌కి వారానికి రూ. లక్షా 30 వేల చొప్పున 3 నెలలకు గాను రూ. 16 లక్షల 90 వేల పారితోషికం బిగ్ బాస్ నిర్వహాకులు ఇచ్చినట్లు తెలుస్తుంది.