Vikrant Massey | 12th Fail చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే (Vikrant Massey) సంచలన ప్రకటన చేశారు. కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ నోట్ పెట్టారు.
కొన్నేళ్లుగా అందరి నుంచి అసాధారమైన ప్రేమ, అభిమానాన్ని పొందుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకూ తనకు సహకారం అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఓ తండ్రిగా, కొడుకుగా, భర్తగా బాధ్యతలు నెరవేర్చాల్సిన టైం వచ్చిందన్నారు. అందుకే కొత్త సినిమాలను అంగీకరించడం లేదని స్పష్టం చేశారు. ‘గత కొన్నేళ్లు అద్భుతంగా గడిచాయి. ఇన్నాళ్లు నాపై ప్రేమ, అభిమానం చూపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నా ఫ్యామిలీకి సమయం కేటాయించాల్సిన టైమ్ వచ్చింది. 2025లో రిలీజ్ అయ్యే సినిమానే నా చివరి మూవీ’ అని విక్రాంత్ మాస్సే ప్రకటించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో అభిమానులతోపాటు సినీ ప్రియులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
కాగా, 37 ఏళ్ల విక్రాంత్ మాస్సే.. సీరియల్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఇక 2017లో ‘ఎ డెత్ ఇన్ ది గంజ్’తో వెండితెరపై హీరోగా తన ప్రస్థానం ప్రారంభించారు. ఇక గతేడాది విడుదలైన 12th Fail చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. విదు వినోద్ చోప్రా తీసిన 12th ఫెయిల్ సినిమా గతేడాది అక్టోబర్ 27వ తేదీన రిలీజైంది. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో ఆ సినిమాను విడుదల చేశారు. చిన్న సినిమాగా విడుదలైన 12Th ఫెయిల్ చిత్రం పెద్ద సినిమాలకు పోటీనిస్తూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో మనోజ్ పాత్రలో విక్రాంత్ మాసే కనిపించారు. మేధా శంకర్ హీరోయిన్ పాత్రను పోషించారు. అనురాగ్ పాఠక్ రాసిన నవల ఆధారంగా 12th ఫెయిల్ సినిమాను తీశారు.
Also Read..
Tamanna | నేనేం ఐటమ్ గర్ల్‌ని కాదు.. తమన్నా అసహనం
Ravi Teja | సూర్య సినిమాలో రవితేజ.. ఈ వార్తలో నిజమెంత?
Akkineni Nageswara Rao | అక్కినేని నాగేశ్వరరావు.. కథానాయకుడిగా 80 ఏండ్లు