Ravi Teja | ప్రస్తుతం రవితేజ ‘మాస జాతర’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మే9న విడుదల కానుంది. ఇదిలావుంటే.. రవితేజ లైనప్ విషయంలో ఓ క్రేజీ న్యూస్ ఒకటి వినిపిస్తున్నది. తమిళంలో ఓ స్టార్ హీరో నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలో ప్రత్యేక పాత్ర చేయడానికి రవితేజ అంగీకరించారట.
వివరాల్లోకెళ్తే.. సూర్య కథానాయకుడిగా ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలోనే రవితేజ స్పెషల్ రోల్ చేయనున్నారట. ఇటీవలే రవితేజకి దర్శకుడు బాలాజీ క్యారెక్టర్ని నరేట్ చేశారని, పాత్ర నచ్చడంతో నటించేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ విషయం ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గత ఏడాది చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ స్పెషల్ రోల్ చేసిన విషయం తెలిసిందే.