Tamanna | నేనేం ఐటమ్ గర్ల్‌ని కాదు.. తమన్నా అసహనం
రజనీకాంత్ ‘జైలర్'లో ‘వా.. కావాలయ్యా.. దా.. దా..’ అంటూ ఐటమ్ నంబర్లో చెలరేగిపోయింది తమన్నా. ఆ సినిమాలో ఆమె చేసింది చిన్న పాత్రే అయినా.. ఆ పాట, అందులో తమన్నా నాట్యాభినయం కొన్ని నెలలపాటు సోషల్ మీడియాను కుదిపేశాయనే చెప్పాలి. రీసెంట్గా ‘స్త్రీ 2’లో కూడా ఓ చిన్న పాత్ర చేశారు తమన్నా.
Tamanna | రజనీకాంత్ ‘జైలర్’లో ‘వా.. కావాలయ్యా.. దా.. దా..’ అంటూ ఐటమ్ నంబర్లో చెలరేగిపోయింది తమన్నా. ఆ సినిమాలో ఆమె చేసింది చిన్న పాత్రే అయినా.. ఆ పాట, అందులో తమన్నా నాట్యాభినయం కొన్ని నెలలపాటు సోషల్ మీడియాను కుదిపేశాయనే చెప్పాలి. రీసెంట్గా ‘స్త్రీ 2’లో కూడా ఓ చిన్న పాత్ర చేశారు తమన్నా. అందులో కూడా ‘ఆజ్ కీ రాత్..’ పాటలో సందడి చేశారు. ఆ సినిమా ఏకంగా 900కోట్ల క్లబ్లో చేరింది. దాంతో ‘తమన్నా ఐటమ్ సాంగ్ చేస్తే సినిమా హిట్’ అనే సెంటిమెంట్ మొదలైంది.
మామూలుగానే సినిమావాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ. అందుకే.. దర్శక, నిర్మాతలంతా ఐటమ్ సాంగ్స్ చేయమంటూ తమన్నా ఇంటిముందు క్యూ కడుతున్నారట. దాంతో తమన్నా అసహనం వ్యక్తం చేశారు. రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘నేను చేసిన పాటలు ఆ సినిమాల సక్సెస్‌లకు హెల్ప్ అవ్వడం ఆనందంగానే ఉంది. అందుకని, వరుసగా ఐటమ్ నంబర్లే చేయమంటే ఎలా? ‘జైలర్’ రజనీసార్ సినిమా అవ్వడంతో ఇష్టంతో చేశా. ‘స్త్రీ2’ డైరెక్టర్ అమర్ కౌశిక్ నాకు మంచి ఫ్రెండ్. తను అడగ్గానే కాదనలేక చేశా. అంతేతప్ప అదేపనిగా ఈ తరహా పాటలు చేయడానికి నేనేం ఐటమ్ గర్ల్‌ని కాదు..’ అంటూ అసహనం వ్యక్తం చేసింది తమన్నా భాటియా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

