Joe Biden | అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే ముందు.. కుమారుడికి బైడెన్ క్షమాభిక్ష
Joe Biden | మరికొన్ని రోజుల్లో పదవి నుంచి దిగిపోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు హంటర్ బైడెన్‌కు భారీ ఊరట కల్పించారు.
Joe Biden | మరికొన్ని రోజుల్లో పదవి నుంచి దిగిపోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు హంటర్ బైడెన్‌కు భారీ ఊరట కల్పించారు. రెండు క్రిమినల్ కేసుల్లో (Criminal Cases) హంటర్‌కు బైడెన్ (Hunter Biden) క్షమాభిక్ష ప్రసాదించారు. తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్టు ఈ సందర్భంగా బైడెన్ పేర్కొన్నారు.
అక్రమంగా తుపాకీ కొనుగోలు, ఆదాయపు పన్ను విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని డెలావెర్, కాలిఫోర్నియాలో హంటర్‌పై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆయుధం కొనుగోలు వ్యవహారంలో నమోదైన కేసులో హంటర్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. అయితే, ఇప్పటి వరకూ శిక్ష మాత్రం ఖరారు చేయలేదు. దీనిపై అప్పట్లో బైడెన్ స్పందిస్తూ.. హంటర్ దోషిగా తేలిన సమయంలో క్షమాభిక్షకు యత్నించబోనని స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే సమయంలో కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశాన్ని వినియోగించుకున్నారు. బైడెన్ నిర్ణయం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
కాగా, ఈ ఏడాది నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20న రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Also Read..
Football Match | ఫుట్‌బాల్ మ్యాచ్‌లో వివాదం.. అభిమానుల మధ్య ఫైట్.. 100 మందికిపైగా మృతి!
ISRO | మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన ఇస్రో.. 4న ప్రోబా-3 మిషన్ ప్రయోగం..!
ISKCON | భారత్‌కు వస్తున్నఇస్కాన్ సభ్యులను.. సరిహద్దుల్లోనే అడ్డుకున్న బంగ్లాదేశ్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

