న్యూఢిల్లీ: రిటైల్ మార్కెట్లో బియ్యం, గోధుమ ధరల్ని, సరఫరాను నియంత్రించే ఉద్దేశంతో ఈ-వేలం ద్వారా ఆహార ధాన్యాల్ని అమ్ముతున్నామని కేంద్రం ప్రకటించింది.
జూన్ 28న గోధుమ, జులై 5న బియ్యం వేలాన్ని ఎఫ్‌సీఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) చేపడుతుందని తెలిపింది. ఈ మేరకు ఎఫ్‌సీఐకి శనివారం మార్గదర్శకాలు జారీచేసింది.
అర్హులైన ట్రేడర్స్‌ను వేలంలో అనుమతిస్తామని ఎఫ్‌సీఐ ఎండీ అశోక్ మీనా తెలిపారు. క్వింటాల్‌కు గోధుమ రూ.2150, రూ.2125, బియ్యం రూ.3100 ప్రాథమిక ధరలుగా ఎఫ్‌సీఐ పేర్కొన్నది.