Jairam Ramesh : కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు (NDA government) తీరుపై కాంగ్రెస్ పార్టీ (Congress party) సీనియర్ నాయకుడు, ఎంపీ జైరామ్ రమేశ్ (Jairam Ramesh) మరోసారి మండిపడ్డారు. ముఖ్యంగా భారత విదేశాంగ శాఖ (External Affairs Ministry) వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. దారితప్పిన భారతదేశ దౌత్యనీతి (Indian Diplomacy) ని సరిచేయడానికి విదేశాంగ శాఖ తగిన సలహా ఇవ్వాలన్నారు.
దేశంలో దౌత్యనీతి పూర్తిగా దెబ్బతిన్నదని జైరామ్ రమేశ్ ఆరోపించారు. భారత్తో పెద్ద ట్రేడ్ డీల్ కుదరబోతోందని అమెరికా అధ్యక్షడు డొనాల్డ ట్రంప్ అన్నారని, ఆ ట్రేడ్ డీల్ ఏమిటో విదేశాంగ శాఖ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని తానే కుదిర్చానని ట్రంప్ మాటిమాటికి చెబుతున్నా విదేశాంగ శాఖ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.
భారత ప్రభుత్వం దేశ దౌత్యనీతిని గాడిన పెట్టాలని, అందుకు విదేశాంగ శాఖ కృషి చేయాలని జైరామ్ రమేశ్ అన్నారు. ముందుగా చేయాల్సిన ఆ పని చేయకుండా 50 ఏళ్ల క్రితం నాటి చరిత్రను తవ్వడంతో ఏం లాభమని ప్రశ్నించారు. ఈ ఏడాది జూన్ 25 నాటికి దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అధికార బీజేపీ ‘సంవిధాన్ హత్యా దివస్’ నిర్వహించడంపై జైరామ్ రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.