Chaiyya Chaiyya Malaika Arora | ‘చల్ ఛయ్యా.. ఛయ్యా’.. ‘చల్ ఛయ్యా.. ఛయ్యా’ అనే పాట గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ పాట 90స్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఒక ఊపు ఉపేసింది. బాలీవుడ్ కథానాయకుడు షారుక్ ఖాన్, మనీషా కోయిరాలా జంటగా నటించిన ‘దిల్ సే’ చిత్రంలోనిదే ఈ పాట. మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రంలో మలైకా ఆరోరా ఈ ప్రత్యేక గీతంలో తన డ్యాన్స్‌తో కుర్రకారుని ఉర్రూతలూగించింది. అయితే ఇదే పాటను ఇప్పుడు రీ క్రియేట్ చేసింది మలైకా ఆరోరా. తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఒక బర్త్‌డే పార్టీని ఏర్పాటు చేయగా.. ఈ పార్టీలో ‘చల్ ఛయ్యా.. ఛయ్యా’ పాటకు అదిరిపోయో స్టెప్పులేసింది మలైకా. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో పాతదని తెలుస్తుంది. కాగా ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.
Read More