కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో నారదా స్టింగ్ ఆపరేషన్ కేసు తీవ్ర దుమారం రేపుతున్నది. కేసు విచారణ కోసం గవర్నర్ అనుమతితో సీబీఐ నలుగురు టీఎంసీ నేతలను అదుపులోకి తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్నది. కేంద్రం కుట్రపూరితంగా కక్ష సాధింపు చర్యలకు పూనుకుందని, కేంద్రం తీరుకు వ్యతిరేకంగా తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జి తెలిపారు.
కరోనా మహమ్మారి విస్తరణ నేపథ్యంలో అనవసరపు నిర్బంధాలు, అరెస్ట్‌లు చేయకూడదని ఇటీవలే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో సీబీఐ అధికారులు, పోలీసులు తమ నేతలను అదుపులోకి తీసుకున్నారని కళ్యాణ్ బెనర్జి మండిపడ్డారు. గవర్నర్ కక్షతోనే కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా తమ నేతల అరెస్టుకు అనుమతించారని ఆయన విమర్శించారు.
గవర్నర్ రానురాను జలగలా మారిపోయారని, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించే ఆయన కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా చేయగలిగినంత చేస్తున్నారని బెనర్జి ఆరోపించారు. వెర్రివాడిలా, రక్తం పీల్చే పురుగులా మారిన గవర్నర్ రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా ఉండేందుకు అర్హుడు కాదని ఆయన విమర్శించారు. అతను రాష్ట్రంలో ఒక పిచ్చిపట్టిన కుక్కలా తిరుగుతున్నాడంటూ కళ్యాణ్ బెనర్జి తీవ్ర పదజాలం ఉపయోగించాడు.
Governor has vindictively done this without consultation of state govt. Governor has become a bloodsucker. He is now trying to secure a ticket before the 2024 elections from BJP, that is why he is doing whatever he pleases against TMC: TMC MP Kalyan Banerjee pic.twitter.com/H3ar2Ze8Zd
— ANI (@ANI) May 17, 2021
మే 20న కేరళ సీఎం ప్రమాణస్వీకారం
భద్రంగా అజ్మీర్‌లోని ఇజ్రాయెల్ మందిరం
యుద్ధం కొనసాగుతుంది: బెంజిమిన్ నెతన్యాహు
గంగా నది ఇసుకలో సమాధులు.. వెలికితీసిన వరుణుడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..