మంగళవారం 02 జూన్ 2020
National - Mar 28, 2020 , 15:23:26

ఐసోలేష‌న్ కేంద్రాలుగా కేంద్రీయ విద్యాల‌యాలు !

ఐసోలేష‌న్ కేంద్రాలుగా కేంద్రీయ విద్యాల‌యాలు !

దేశంలోని కేంద్రీయ విద్యాల‌యాల‌ను ఐసోలేష‌న్ సెంట‌ర్లుగా వినియోగించుకోవ‌డానికి కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ అనుమ‌తించింది. ఎంహెచ్ఆర్‌డీ శాఖ మంత్రి ర‌మేష్ పోక్రియాల్ నిశాంక్ ఈ విష‌య‌మై కేంద్రీయ విద్యాల‌యాల‌ను ఆదేశించారు. 

ఆయా ప్రాంతాల‌లోని స్థానిక ప‌రిపాల‌న శాఖ‌కు అప్ప‌గించాల‌ని సూచించారు. ఇప్ప‌టికే న‌వోద‌య విద్యాల‌యాల‌ను ఐసోలేష‌న్ కేంద్రాలుగా/క‌్వారంటైన్ క్యాంప‌స్‌లుగా మార్చ‌డానికి అనుమ‌తించిన విష‌యం విదిత‌మే. ఆయా ప్రాంతాల‌లోని అధికారులు అభ్య‌ర్థ‌నలు వ‌స్తే కేవీల‌ను ఇస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ఇప్ప‌టికే కేవీ, ఎన్‌వీలు విద్యార్థుల‌కు సెల‌వులు ప్ర‌క‌టించాయి. విద్యార్థుల‌కు ఈ లెర్నింగ్ విధానంలో బోధ‌న కొన‌సాగిస్తున్నారు. ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. 


logo