Automobile companies | ఆటోమొబైల్ సంస్థల ఆఫర్.. 1.5 శాతం నుంచి 3 శాతం వరకు రాయితీ
Automobile companies | వచ్చే పండుగ సీజన్ కంటే ముందుగానే ఆటోమొబైల్ సంస్థలు కొనుగోలుదారులకు శుభవార్తను అందించాయి. పలు ప్యాసింజర్ అండ్ కమర్షియల్ వాహనాల తయారీ సంస్థలు స్క్రాపేజ్ సర్టిఫికెట్తో తమ వాహనాలపై 1.5 శాతం నుంచి 3 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 27: వచ్చే పండుగ సీజన్ కంటే ముందుగానే ఆటోమొబైల్ సంస్థలు కొనుగోలుదారులకు శుభవార్తను అందించాయి. పలు ప్యాసింజర్ అండ్ కమర్షియల్ వాహనాల తయారీ సంస్థలు స్క్రాపేజ్ సర్టిఫికెట్తో తమ వాహనాలపై 1.5 శాతం నుంచి 3 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించాయి. పాత వాహనాలు ఇచ్చి కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అనంతరం పలు ఆటోమొబైల్ సంస్థలు ప్రకటించాయి.
దీంట్లో భాగంగా జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ఏకంగా రూ.25 వేల రాయితీని ప్రకటించింది. దేశీయ ఆటోమొబైల్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన సమావేశానికి దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. కమర్షియల్ వాహన తయారీదారులు.. రెండేండ్లపాటు రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించగా, ప్యాసింజర్ వాహన సంస్థలు అయితే స్వల్పకాలం మాత్రమే అంటే ఏడాది వరకు ఈ ప్రయోజనాలను కల్పించనున్నట్లు పేర్కొంది. వీటిలో కార్ల తయారీ దిగ్గజాలైన మారుతి సుజుకీ, టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ మోటర్, కియా మోటర్స్, టయోటా కిర్లోస్కర్, హోండా కార్స్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్, రెనో, నిస్సాన్, స్కోడా ఇండియా సంస్థలు షోరూం ధరలో 1.5 శాతం లేదా రూ.20 వేల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించాయి.
వాహన స్థితి ఆధారంగా..
వాహన స్థితి ఆధారంగా అదనంగా డిస్కౌంట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆటోమొబైల్ వర్గాలు వెల్లడించాయి. ప్యాసింజర్ వాహన తయారీ సంస్థలు తమకు నచ్చిన మాడళ్లకు మాత్రమే ఈ రాయితీ వర్తింపు చేసుకునే అవకాశాలను కూడా కల్పించింది. పాత కార్ల స్థానంలో ఎక్సేంజ్ కింద కొత్త కార్లను కొనుగోలు చేసేవారికి ఈ ప్రయోజనాలు పొందవచ్చును.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

