బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 21:17:57

ఇది కేఎఫ్‌సీ మాస్క్‌!

ఇది కేఎఫ్‌సీ మాస్క్‌!

న్యూ ఢిల్లీ: కరోనా నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఫేస్‌ మాస్కులు పెట్టుకోవాల్సిందే. అయితే, కొందరు ఇష్టమొచ్చిన వాటిని మాస్కులుగా ధరిస్తూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. ఇటీవల, ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో ఒక మహిళ విచిత్రమైన మాస్కు ధరించి, సామాజిక మాధ్యమాల్లోకెక్కింది. ఓక్లాండ్స్ పార్క్ వద్ద ఒక  షాపింగ్‌లోపల ఆ మహిళ కేఎఫ్‌సీ ఆహారపదార్థాలు అందించే అట్టపెట్టెను మాస్కులాగా ధరించింది. ఆమెను ఒకరు ఫొటో తీసి, సోషల్‌ మీడియా పెట్టగా, ఇప్పుడీ చిత్రం వైరల్‌ అవుతోంది. ఇది కేఎఫ్‌సీ మాస్క్‌ అంటూ నెటిజన్లు ఆటపట్టిస్తున్నారు. 

 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo