శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 17:48:28

దగదగలాడుతున్న గోల్డ్‌ మాస్క్‌.. ధర ఎంతో తెలుసా?

దగదగలాడుతున్న గోల్డ్‌ మాస్క్‌.. ధర ఎంతో తెలుసా?

ఒడిశా : కటక్‌కు చెందిన అలోక్ మొహంతి అనే వ్యాపారవేత్త రూ .3.5 లక్షల విలువైన బంగారు మాస్కును ధరించి ఆశ్చర్యపరిచాడు. ఈ సందర్భంగా మొహంతి మాట్లాడుతూ తాను 40 సంత్సరాలుగా బంగారం ధరిస్తున్నాని, తనకు బంగారం ధరించడం ఇష్టమని తెలిపాడు. తన ఒంటిపై అనేక బంగారు ఆభరణాలు ఎల్లప్పుడూ ఉంటాయని, అందువల్లే అందరూ తనను గోల్డ్‌ మ్యాన్‌ అని పిలుస్తారని మొహంతి చెప్పుకొచ్చాడు. ఇటీవల ముంబైకి చెందిన ఓ వ్యక్తి బంగారు ముసుగు ధరించడాన్ని టీవీలో చూసి తానుకూడా రూ.3.5 లక్షలతో సుమారు 8 తులాలతో మాస్కు తయారు చేసుకొని ధరిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల సూరత్‌లో ఓ జ్యువెల్లరీ షాపు యజమాని రూ.4 లక్షల విలువైన వజ్రాలతో తయారు చేసిన మాస్కులను విక్రయించిన సంగతి తెలిసిందే. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo