Ram Temple : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం అయోధ్య నగరం (Ayodhya city) లోని ప్రతిష్ఠాత్మక రామ మందిరం (Ram Temple) పై బంగారు తాపడపు శిఖరాన్ని ఏర్పాటు చేశారు. జూన్ 3న అంటే మంగళవారం ఆలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం (Pran Pratishtha ceremony) జరగనున్న నేపథ్యంలో అందుకు ఒక్క రోజు ముందే బంగారు తాపడపు శిఖరాన్ని ఏర్పాటు చేశారు.
మంగళవారం ఆలయంలోని రామ్ దర్బార్లో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఆలయంపై బంగారు శిఖరాన్ని ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ప్రత్యేక శోభను సంతరించుకున్నది. రామ్ మందిరంపై బంగారు శిఖరాన్ని ఏర్పాటు చేసిన దృశ్యాన్ని కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Ayodhya | Gold-plated ‘Shikhara’ installed on top of Ram Temple ahead of the 3rd June Pran Pratishtha ceremony of Ram Darbar at the temple pic.twitter.com/bPtkTbbBwU
— ANI (@ANI) June 2, 2025