India vs USA | అమెరికా దిగుమతులపై రాయితీలను తొలగించనున్న భారత్.. ఎందుకంటే..!
India vs USA | అమెరికా (USA) నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులకు ఇస్తున్న రాయితీలను క్రమంగా తొలగించాలని భారత్ (India) భావిస్తున్నది.
India vs USA : అమెరికా (USA) నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులకు ఇస్తున్న రాయితీలను క్రమంగా తొలగించాలని భారత్ (India) భావిస్తున్నది. అంతేగాక అగ్రరాజ్యం నుంచి దిగుమతి అయ్యే లోహాలపై అధిక సుంకాలు (Tariffs) విధించడానికి కేంద్ర సర్కారు (Union govt) చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
భారత స్టీల్, అల్యూమినియంపై విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా అమెరికాకు చెందిన వస్తువులపై ప్రతీకార సుంకాలు విధిస్తామంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా నోటీసులు ఇప్పించినా.. అమెరికా స్పందించకపోవడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అమెరికాకు చెందిన కొన్ని రకాల వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించనున్నామన్న విషయాన్ని భారత్ ఇటీవల ప్రపంచ వ్యాణిజ్యసంస్థకు వెల్లడించింది.
భారత స్టీల్, అల్యూమినియంపై విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రపంచ వాణిజ్యసంస్థ ద్వారా అమెరికాకు నోటీసులు ఇప్పించింది. అయితే ఆ నోటీసులను అగ్రరాజ్యం తిరస్కరించింది. భారత్ నిర్ణయం బహుపాక్షిక వాణిజ్య నియమాలకు అనుగుణంగా లేదని పేర్కొంది. ఉక్కు, అల్యూమినియంపై తమ సుంకాలు భారత్ పేర్కొన్నట్లుగా ‘భద్రతా చర్యలు’ కాదని, జాతీయ భద్రతా పరిగణనలపై ఆధారపడి ఉన్నాయని తెలిపింది.
ఈ విషయంపై భారత్‌తో ఎలాంటి చర్చలు నిర్వహించబోమని ట్రంప్ యంత్రాంగంలోని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమెరికా దిగుమతులకు ఇస్తున్న రాయితీలను దామాషా ప్రకారం తొలగించాలని భారత్ భావిస్తోంది. అమెరికా నుంచి వచ్చే లోహాలపై అధిక సుంకాలు విధించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై భారీఎత్తున టారిఫ్‌లు విధించారు.
భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉక్కు, అల్యూమినియంలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు తొలుత ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు.. ఈ సుంకాలను జూన్ 4 నుంచి 50 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల 7.6 బిలియన్ డాలర్ల విలువైన భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడనుంది. దాంతో అగ్రరాజ్యం రక్షణాత్మక వైఖరిని అవలంభిస్తోందని తప్పుపడుతూ భారత్ ప్రపంచ వ్యాణిజ్యసంస్థను ఆశ్రయించింది.
సరికొత్త వాణిజ్య ఒప్పందానికి భారత్, అమెరికా అత్యంత సమీపంలోకి వచ్చినట్లు వార్తలొస్తున్న వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికాకు వాణిజ్యలోటును తగ్గించేందుకు భారత్ చాలా రాయితీలను ఈ డీల్ ద్వారా ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. కాగా ప్రస్తుతం అగ్రరాజ్యం అనుసరిస్తున్న చర్యలతో ఆ రాయితీలకు కోతలు విధించే అవకాశం ఉంది.
Read More >>
ఆ కాల్పులు మా పని కాదు.. వాళ్లను చంపింది హమాస్ మిలిటెంట్లే : ఇజ్రాయెల్
‘నా తల్లి ఎక్కడుంది.. కోర్టులో హాజరుపర్చాలి’.. సుప్రీంకోర్టులో అస్సాం యువకుడి పిటిషన్
ఆ ప్రకటనపై భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి : పీయూష్ గోయల్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

