e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home News 8 కాళ్ల‌తో మేక పిల్ల జ‌న‌నం.. ఎక్క‌డంటే..?

8 కాళ్ల‌తో మేక పిల్ల జ‌న‌నం.. ఎక్క‌డంటే..?

8 కాళ్ల‌తో మేక పిల్ల జ‌న‌నం.. ఎక్క‌డంటే..?

కోల్‌క‌తా : సాధారణంగా మేక పిల్ల‌లు రెండు కాళ్ల‌తో జ‌న్మించ‌డం చూశాం.. అక్క‌డ‌క్క‌డ మూడు కాళ్ల‌తో జ‌న్మించిన మేక పిల్ల‌ల‌ను చూశాం. కానీ ఈ మేక పిల్ల మాత్రం 8 కాళ్ల‌తో జ‌న్మించింది. ఇలా జ‌న్మించిన మేక పిల్ల‌ను చూసేందుకు జ‌నాలు ఆస‌క్తి చూపారు. ప‌శ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పర‌గ‌ణ జిల్లాలోని క‌ల్మేగా ఏరియాలో శుక్ర‌వారం ఉద‌యం ఓ మేక ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇందులో ఒక మేక పిల్ల సాధార‌ణంగా జ‌న్మించ‌గా, మ‌రో మేక పిల్ల మాత్రం 8 కాళ్ల‌తో జ‌న్మించింది.

ఈ సంద‌ర్భంగా మేక య‌జ‌మాని స‌ర‌స్వ‌తి మండ‌ల్ మాట్లాడుతూ.. ఆవుల‌ను, మేక‌ల‌ను పెంచుకుంటున్నామ‌ని తెలిపారు. అయితే 8 కాళ్ల‌తో జ‌న్మించిన మేక పిల్ల‌.. ప్ర‌స‌వించిన ఐదు నిమిషాల‌కే చ‌నిపోయింద‌ని చెప్పారు. మ‌రో మేక పిల్ల‌తో పాటు దాని త‌ల్లి సుర‌క్షితంగా ఉన్న‌ట్లు ఆమె పేర్కొన్నారు. ఇలా 8 కాళ్ల‌తో జ‌న్మించిన మేక పిల్ల‌ను చూడ‌టం ఇదే తొలిసారి అని స్ప‌ష్టం చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
8 కాళ్ల‌తో మేక పిల్ల జ‌న‌నం.. ఎక్క‌డంటే..?
8 కాళ్ల‌తో మేక పిల్ల జ‌న‌నం.. ఎక్క‌డంటే..?
8 కాళ్ల‌తో మేక పిల్ల జ‌న‌నం.. ఎక్క‌డంటే..?

ట్రెండింగ్‌

Advertisement