గంజాయి పండించుకోవచ్చు కానీ..!

పనజీ: ఔషధాల్లో వినియోగించుకోవడం కోసం గంజాయి పండించుకోవచ్చంటూ గోవా న్యాయశాఖ జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదమవుతున్నాయి. వీటిపై అక్కడి ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రతిపాదనలకు న్యాయశాఖ ఆమోదం తెలిపినట్లు గోవా న్యాయ శాఖ మంత్రి నీలేష్ కాబ్రల్ వెల్లడించారు. దీనివల్ల సహజసిద్ధమైన డ్రగ్‌ను ఫార్మాసూటికల్ కంపెనీలకు విక్రయించవచ్చని ఆయన చెప్పారు. ఈ ప్రతిపాదనకు గోవా ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపలేదని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పడం గమనార్హం. అయితే ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం పూర్తిగా దిగజారిపోయిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అమర్నాథ్ పాంజికర్ విమర్శించారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని ఆయన అన్నారు. ఇప్పటికే గోవాలో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయిన వేళ ఈ అనుమతుల వల్ల మరింత గంజాయి మార్కెట్లోకి రానుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
- కరోనా ఖతం.. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోదీ
- దేశంలో కొత్తగా 15,158 పాజిటివ్ కేసులు
- రాష్ర్టంలో కొత్తగా 249 కరోనా కేసులు
- రోహిత్ శర్మ ఔట్.. ఇండియా 62-2
- హార్ధిక్ పాండ్యా తండ్రి కన్నుమూత..
- హత్య చేసే ముందు హంతకుడు అనుమతి తీసుకుంటడా?
- పెళ్లిలో కన్నీరు పెట్టుకున్న వరుడు.. ఎందుకో తెలుసా?
- కోవిడ్ టీకా తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి..
- జూన్ రెండో వారంలో తెలంగాణ ఎంసెట్!
- సైనీ.. ఇవాళ కూడా మైదానానికి దూరం