Nitish Kumar | పార్టీలకు కాదు, ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వండి.. మంత్రులకు నితీశ్ చురక
Nitish Kumar | ప్రభుత్వం సాధించిన విజయాలను పార్టీలకు ఆపాదించవద్దని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. సుమారు ఏడు పార్టీలతో కూడిన ప్రభుత్వంలోని మంత్రులకు ఈ మేరకు చురకలు వేశారు.
పాట్నా: ప్రభుత్వం సాధించిన విజయాలను పార్టీలకు ఆపాదించవద్దని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. సుమారు ఏడు పార్టీలతో కూడిన ప్రభుత్వంలోని మంత్రులకు ఈ మేరకు చురకలు వేశారు. బీహార్ రాష్ట్ర పవర్ (హోల్డింగ్) కంపెనీ లిమిటెడ్ 11వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సుమారు రూ. 14,000 కోట్ల విలువైన విద్యుత్ ప్రాజెక్టులను సీఎం నితీశ్ కుమార్ ఆవిష్కరించారు. ఆయన పార్టీ జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన విద్యుత్ మంత్రి బిజేంద్ర యాదవ్, కీలకమైన రెవెన్యూ, భూ సంస్కరణల శాఖ కలిగిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అగ్రనేత అలోక్ మెహతా తదితరులు పాల్గొన్నారు.
కాగా, ఈ సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ మాట్లాడారు. మహా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న పార్టీలు తమ ప్రతిష్టను పెంచుకోవడానికి ప్రభుత్వం సాధించిన విజయాలను ఉపయోగించుకోవడాన్ని ఆయన ఖండించారు. ‘నా మంత్రులలో చాలామంది ప్రభుత్వం చేసిన మంచి పనికి వారి పార్టీలకు క్రెడిట్ ఇవ్వడం నేను గమనించాను. ఇది సరికాదు’ అని పరోక్షంగా ఆర్జేడీ మంత్రులను విమర్శించారు. అయితే తన పార్టీకి చెందిన విద్యుత్ మంత్రి బిజేంద్ర యాదవ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. తాను అధికారంలో ఉన్నంత వరకు ఆయన కూడా పదవిలో ఉంటారని అన్నారు. ఆయన నిరాకరిస్తే తాను కూడా అంతా వదిలేస్తానని వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

