Boat Swing | రాజస్థాన్ (Rajasthan)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బరాన్ నగరం (Baran city)లోని ఝుల బజార్ (Jhula Bazaar) ప్రాంతంలో జరుగుతున్న డోల్ మేళా (Dol Mela)లో బోట్ స్వింగ్ (Boat Swing) నుంచి ఓ బాలిక కిందపడిపోయి తీవ్ర గాయాలపాలైంది.
ఈ మేళాను వేల మంది సందర్శిస్తుంటారు. తాజాగా డోల్ మేళాకు వెళ్లిన ఓ బాలిక అక్కడ ఏర్పాటు చేసిన బోట్ స్వింగ్ రైడ్ ఎక్కింది. దాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో స్వింగ్ పైకి వెళ్లినప్పుడు ఆ బాలిక ప్రమాదవశాత్తూ పట్టుకోల్పోయి ట్యూబ్లైట్ల (Tubelights) మీద పడిపోయింది. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆ బాలికను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ డోల్ మేళాకు రాజస్థాన్ ప్రజలే కాకుండా మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ సహా సమీప రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.
Also Read..
Jagdeep Dhankhar | ఎట్టకేలకు కనిపించారు.. రాజీనామా తర్వాత తొలిసారి బయటకొచ్చిన ధన్ఖడ్