Giriraj Singh : లోక్సభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గురువారం విమర్శలతో విరుచుకుపడ్డారు. జమ్ము కశ్మీర్ ప్రజలను రాహుల్ రెచ్చగొడుతున్నారని, కాంగ్రెస్ ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తుందని ఆయన చెబుతున్నారని కానీ దేశం దీన్ని అంగీకరించదని అన్నారు. నిరాశలో కూరుకుపోయిన రాహుల్ గాంధీ నైతిక స్ధైర్యం కోల్పోయారని అన్నారు.
రాహుల్ తన కులం, మతం గురించి చెప్పలేరని, కానీ రాజకీయ భాషలో ఓబీసీల గురించి మాట్లాడుతుంటారని ఎద్దేవా చేశారు. కాగా, నియంతృత్వ పోకడలతో చెలరేగే ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసాన్ని కాంగ్రెస్ వమ్ము చేసిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. జమ్ములో గురువారం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, ఆరెస్సెస్ మధ్య సైద్ధాంతిక పోరాటం సాగుతున్నదని, మీరు మా పక్షాన నిలిచారని కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ అన్నారు.
తాను పార్లమెంట్లో కూర్చుండగా మోదీని చూశానని, మీరు ఆయన విశ్వాసాన్ని మటుమాయం చేశారని తాను చెప్పగలనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని మోదీకి మానసికంగా ఎంత టెన్షన్ ఇచ్చారంటే ఆయన సైకాలజీ పతనమైందని వ్యాఖ్యానించారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కార్యకర్తలను కోరారు.
Read More :
Hyderabad | రాత్రిపూట మహిళలకు ఉచిత రవాణా.. హైదరాబాద్ పోలీసుల వివరణ ఇదీ..!