Gaurav Bhatia : కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసు దర్యాప్తును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఘటన జరిగి ఐదు రోజులు అయినప్పటికీ, దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నది. కేసు డైరీని సాయంత్రంలోగా, ఇతర డాక్యుమెంట్లను బుధవారం ఉదయం 10 గంటల్లోగా సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.వారం రోజుల్లోగా దర్యాప్తు ఓ కొలిక్కిరాకుంటే విచారణను సీబీఐకి అప్పగిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఇక కోర్టు తీర్పు, మీడియా వార్తలపై బీజేపీ నేత గౌరవ్ భాటియా స్పందించారు. కోర్టు ఆదేశాలు, గత కొద్దిరోజులుగా వెల్లడవుతున్న వార్తల ప్రకారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ కేసులో ఎవరినో కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోందని వ్యాఖ్యానించారు. దీనిపై దీదీ ఇవాళ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆధారాల సేకరణకు తొలి 48 గంటలు కీలకమని అన్నారు. ఈ నేరం జరిగిన సమయంలో మమతా బెనర్జీ ప్రకటన చేశారని, కేసును కొద్దిరోజుల తర్వాత సీబీఐకి బదలాయిస్తామని ఆమె ఎందుకు చెప్పాల్సివచ్చిందని గౌరవ్ భాటియా నిలదీశారు.
ఈ కేసును సీబీఐకి సత్వరమే బదిలీ చేసి ఉంటే వారు నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టి ఘటనా స్ధలంలో ఆధారాలు మటుమాయం కాకుండా కాపాడేవారని అన్నారు. కాగా, ఈ కేసుకు సంబంధించి పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. నిందితుడు బాధితురాలిపై క్రూరమైన దాడికి పాల్పడ్డాడని, ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలైనట్టు తేలింది. అదేవిధంగా తనపై లైంగిక దాడిని బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో పెనుగులాట చోటుచేసుకొన్నట్టు పోస్టుమార్టం నివేదిక చెబుతున్నది. ముఖంపై రక్తపు గాయాలున్నాయని, కండ్లలో నుంచి రక్తసావ్రం అయిందని, బాధితురాలి జననాంగాల్లో తీవ్రమైన గాయం అయినట్టు తేలింది. గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడంతో బాధితురాలు మరణించినట్టు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.
Read More :
Hardik Pandya: బ్రిటీష్ సింగర్‌తో డేటింగ్ చేస్తున్న హార్ధిక్ పాండ్యా !