న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్ ధరపై కేంద్రం రూ.39 పెంచింది. దీంతో హైదరాబాద్లో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,919కి చేరుకుంది. మరోవైపు విమాన ఇంధన ధర కిలోలీటరుకు రూ.4,495 (4.58 శాతం) తగ్గించింది.
దీంతో న్యూఢిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.93,480కి తగ్గింది. ప్రభుత్వ చమురు సంస్థలు గృహ వినియోగ వంటగ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్ ధర హైదరాబాద్లో రూ.855గా ఉంది.