చెన్నై: లారీలో రహస్యంగా దాచి గంజాయిని రవాణా చేస్తున్నారు. సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఆ లారీని అడ్డుకున్నారు. తనిఖీ చేయడంతో రెండు కోట్ల విలువైన గంజాయి బయటపడింది. (Ganja Worth Rs 2 Crore seized) తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. మినీ లారీలో ప్రత్యేకంగా రూపొందించిన కుహరంలో గంజాయిని రవాణా చేస్తున్నట్లు ఎన్సీబీ అధికారులకు రహస్య సమాచారం అందింది.
కాగా, చెన్నై జోనల్ అధికారులు రంగంలోకి దిగారు. ఆదివారం చెన్నైలోని కరణోడై టోల్ ప్లాజా సమీపంలో ఆ మినీ లారీని అడ్డుకున్నారు. వాహనం కింది భాగంలో దాచిన 150 ప్యాకెట్ల గంజాయిని కనుగొన్నారు. రూ.2 కోట్ల విలువైన 320 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఈ గంజాయిని ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైకి తరలించినట్లు ఎన్సీబీ అధికారులు నిర్ధారించారు. లారీ డ్రైవర్‌తోపాటు నకిలీ నంబర్ ప్లేట్లు, నకిలీ ఫాస్ట్ ట్యాగ్ ఏర్పాటు చేసిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు. గంజాయి స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో భాగమైన ఇతర వ్యక్తుల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు.
Also Read:
Maoists Surrender | ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 170 మంది మావోయిస్టులు
Dead Pigeons In Well | బావిలో చనిపోయిన పావురాలు.. కలుషిత నీరు తాగి 60 మందికి అస్వస్థత
Gujarat ministers resign | గుజరాత్ మంత్రులంతా రాజీనామా.. రేపు మంత్రివర్గ విస్తరణ