Ganesh mandal | ఆ గణేశుడి మండపానికి ఏకంగా రూ.474 కోట్ల ఇన్సూరెన్స్..!
Ganesh mandal | యావత్ భారత దేశం గణపతి నవరాత్రి ఉత్సవాలకు (Ganesh Navratri Celebrations) కు సిద్ధమవుతోంది. విభిన్న ఆకృతుల్లో కొలువుదీరే వినాయకుల కోసం అంతటా మండపాలను ముస్తాబు చేస్తున్నారు. ప్రతి ఏటా ఖరీదైన గణేశుడి విగ్రహాలు (Ganesh idols), భారీ సెట్టింగ్‌లతో ఏర్పాటయ్యే తాత్కాలిక మండపాలు ఆకర్షణగా నిలుస్తుంటాయి.
Ganesh mandal : యావత్ భారత దేశం గణపతి నవరాత్రి ఉత్సవాలకు (Ganesh Navratri Celebrations) కు సిద్ధమవుతోంది. విభిన్న ఆకృతుల్లో కొలువుదీరే వినాయకుల కోసం అంతటా మండపాలను ముస్తాబు చేస్తున్నారు. ప్రతి ఏటా ఖరీదైన గణేశుడి విగ్రహాలు (Ganesh idols), భారీ సెట్టింగ్‌లతో ఏర్పాటయ్యే తాత్కాలిక మండపాలు ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఏదైనా జరిగితే భారీగా నష్టపోకుండా కొన్ని మండపాలకు ఇన్సూరెన్స్ చేస్తారు.
ఈ నేపథ్యంలోనే ముంబైలోని ఓ గణేశుడి మండపానికి కూడా ఏకంగా రూ.474.46 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ముంబై శివారులోని మతుంగా ప్రాంతంలో గత ఏడు దశాబ్దాలుగా జీఎస్బీ సేవామండల్.. వినాయక చవితి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నది. ఈసారి 71వ వార్షికోత్సవం జరగనుంది.
దేశంలోనే సంపన్న వినాయకుడిగా పేరొందిన ఈ విఘ్నేశ్వరుడి వేడుకలకు ఈ ఏడాది ఏకంగా రూ.474.46 కోట్లతో బీమా చేయించారు. ఇక్కడి విగ్రహాన్ని భారీఎత్తున బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించనుండటమే అందుకు కారణం. గత ఏడాది సైతం ఈ గణేశ్ మండపానికి రూ.400.58 కోట్లతో బీమా చేయించినట్లు నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. ఇప్పుడు బంగారం, వెండి ధరలు పెరగడంతో బీమా విలువను కూడా పెంచారు.
అందులో పూజారులు, నిర్వాహకులు, సహాయకులు, భద్రతా సిబ్బందికి రూ.375 కోట్లతో వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకున్నారు. గణపయ్యకు అలంకరించే బంగారం, వెండి ఆభరణాలకు రూ.67 కోట్లతో బీమా చేయించారు. 2023, 2024 సంవత్సరాల్లో గణపయ్య ఆభరణాలకు వరుసగా రూ.38 కోట్లు, రూ.43 కోట్లు బీమా కవరేజ్ తీసుకున్నారు.
అంతేగాక అగ్నిప్రమాదం, భూకంపం ముప్పు వంటి వాటికోసం ప్రత్యేకంగా మరో రూ.2 కోట్ల బీమా చేయించారు. అక్కడి ఫర్నీచర్, కంప్యూటర్లు, సీసీటీవీలు, స్కానర్లు ఇన్సూరెన్స్ పరిధిలో ఉన్నాయి. పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ కింద రూ.30 కోట్లు కేటాయించారు. భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్ కోడ్, డిజిటల్ లైవ్ సేవలను కూడా నిర్వాహకులు అందుబాటులోకి తెచ్చారు. భద్రతా చర్యల్లో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను కూడా ఏర్పాటుచేశారు.
Read More >>
వరదలో కొట్టుకుపోయిన కారు.. మహారాష్ట్రలో జగిత్యాల వాసుల గల్లంతు
వారిని విధుల్లోకి తీసుకునే అంశాన్ని పరిశీలించండి.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
నిన్ను మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వను.. తమిళనాడు సీఎం స్టాలిన్‌కు శశికళ ఛాలెంజ్
ఇదొక ‘చెత్త’ సర్కారు.. ఎక్స్ వేదికగా కేటీఆర్ ఫైర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

