VK Sasikala : తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) కు ఏఐఏడీఎంకే (AIADMK) మాజీ నాయకురాలు వీకే శశికళ (VK Sasikala) సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే (DMK) పార్టీని గెలువనివ్వనని, స్టాలిన్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వబోనని శపథం చేశారు. అమ్మ జయలలిత (Jayalalitha) తమిళనాడు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఇప్పటి పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.
‘ఈ ఎన్నికల్లో ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలి. అమ్మ జయలలిత తమిళనాడును ఎంతో అభివృద్ధి చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. నాకు నిద్ర కూడా సరిగా రావడంలేదు. మేం మంచి పాలన అందించాం. అందుకే ఇప్పటి పరిస్థితుల వల్ల కలిగే బాధ మాకు మాత్రమే తెలుసు. నిన్ను (స్టాలిన్‌ను) మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వను. మరోసారి నువ్వు అధికారంలోకి రాలేవు.’ అని శశికళ వ్యాఖ్యానించారు.
ఆఖరికి ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో కూడా పారిశుద్ధ్య కార్మికులను ప్రైవేటైజ్ చేశారని శశికళ గుర్తుచేశారు. అది కూడా కరెక్టు కాదని అన్నారు. జయలలిత బతికి ఉంటే అలా జరిగేది కాదని చెప్పారు.