హైదరాబాద్: రామంతాపూర్ గోకులేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి ఊరేగింపులో జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కంరెటు షాకుకు గురై ఐదుగురు యువకులు మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. పండుగ వేళ జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరమని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
కృష్ణాష్టమి సందర్భంగా రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో ఆదివారం రాత్రి రథయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగలడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతించెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
రామంతపూర్ గోఖలేనగర్‌లో శ్రీ కృష్ణాష్టమి ఊరేగింపులో జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరం.
కరెంట్ షాక్‌కు గురై ఐదుగురు యువకులు మరణించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. పండుగ వేళ జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరమైనది.
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా…
— KTR (@KTRBRS) August 18, 2025
Electric Shock | కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. రథానికి కరెంటు తీగలు తగిలి ఐదుగురు మృతి