Electric Shock | కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. రథానికి కరెంటు తీగలు తగిలి ఐదుగురు మృతి
హైదరాబాద్ రామంతాపూర్‌లో (Ramanthapu) అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీకృష్ణాష్టమి (Sri Krishnashtam) వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు (Electric Shock) తగిలి ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
హైదరాబాద్: హైదరాబాద్ రామంతాపూర్‌లో (Ramanthapu) అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీకృష్ణాష్టమి (Sri Krishnashtam) వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు (Electric Shock) తగిలి ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. కృష్ణాష్టమి సందర్భంగా రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో ఆదివారం రాత్రి ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలో రథాన్ని లాగుతున్న వాహనం బ్రేక్ డౌన్ అయింది. దానిని పక్కన నిలిపివేసిన యువకులు.. రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. దానికి కరెంటు తీగలు తగలడంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాక్ కొట్టింది. దీంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లుగా దూరంగా పడిపోయారు. వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సీపీఆర్ చేసేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.

మరో నలుగురిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన వారిని కృష్ణయాదవ్ (21), సురేశ్ యాదవ్(34), శ్రీకాంత్‌రెడ్డి (35), రుద్రవికాస్ (39), రాజేంద్రరెడ్డి (45)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గన్‌మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు తెలుస్తున్నది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

