హైదరాబాద్: బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sarvai Papanna) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. పీడిత జనుల కోసం, బహుజుల ఆత్మగౌరవం కోసం తన సర్వసాన్ని ధారబోసిన మహయోధుడు అని చెప్పారు. నిరంకుశ పాలనకు ఎదురొడ్డి, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన పాపన్న గౌడ్ తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమంటూ ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు.
‘బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. పీడిత జనుల కోసం, బహుజనుల ఆత్మగౌరవం కోసం తన సర్వస్వాన్ని ధారబోసిన మహాయోధుడు సర్వాయి పాపన్న. నిరంకుశ పాలనకు ఎదురొడ్డి, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన పాపన్న గౌడ్ తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణం. సామాజిక, రాజకీయ సమానత కోసం కృషి చేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న గారి పోరాటస్ఫూర్తిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. సామాజిక విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గొప్పతనాన్ని స్మరించుకుంటూ.. జోహార్ పాపన్న!’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.