Gaganyaan | గువాహటి : మన దేశపు తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ ప్రయోగం 2026 చివర్లో జరుగుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ రాకెట్ మానవ రహిత ప్రయోగం జరుగుతుందన్నారు. ఐఐటీ గువాహటిలో సోమవారం జరిగిన కార్యక్రమానికి హాజరైన సోమనాథ్ విలేకర్లతో మాట్లాడారు. గగన్యాన్ ప్రాజెక్టు కోసం నాలుగేళ్ల నుంచి కృషి చేస్తున్నామని చెప్పారు. మానవ రహిత రాకెట్ ప్రయోగంలో భాగంగా దానిలో వ్యోమమిత్ర అనే రోబోను ఉంచుతామని తెలిపారు.