మళ్లీ పెరిగిన ఇంధన ధరలు
పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంపు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఒక్కరోజు గ్యాప్ ఇచ్చిన ఆయిల్ కంపెనీలు దేశంలో ఇంధన ధరలను మళ్లీ పెంచాయి. తాజాగా శనివారం లీటర్ పెట్రోల్ ధర 91 పైసలు, డీజిల్ 87 పైసలు చొప్పున పెరిగింది. పెట్రో రేట్లు పెరుగడం గత 12 రోజుల వ్యవధిలో ఇది పదోసారి. మొత్తంగా లీటర్ పెట్రోల్‌పై రూ.8.13, డీజిల్‌పై రూ.7.83 పెరిగింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.116.33, డీజిల్ 102.45కి చేరింది.