Viral Video | ముంబై మురికివాడ నుంచి ఫ్యాషన్ ఐకాన్‌గా ఎదిగిన బాలిక
మేకప్ మాయాజాలం కంటే మట్టి వాసనలోనే సహజ సౌందర్యం (Viral Video) ఉట్టిపడుతుందని ఆ బాలిక చాటింది.
ముంబై : నేపధ్యం ఎలాంటిదైనా కలలకు రెక్కలు తొడిగితే ఈ ప్రపంచంలో అందనిదంటూ ఉండదని ఆ బాలిక నిరూపించింది. తన చుట్టూ పేదరికం, సమస్యలు చుట్టుముట్టినా వాటిని అలవోకగా దాటి అందాల ప్రపంచంలో అడుగుపెట్టింది. మేకప్ మాయాజాలం కంటే మట్టి వాసనలోనే సహజ సౌందర్యం (Viral Video) ఉట్టిపడుతుందని చాటింది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబైలోని ధారావికి చెందిన 14 ఏండ్ల బాలిక మలీషాను ఫ్యాషన్ ప్రపంచం అక్కున చేర్చుకుంది. ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ఫ్యాషన్ మోడల్‌గా మలీషాను ఎంచుకుంది.
Maleesha resides in a slum with her family in Bandra, Mumbai. She is an aspiring model n has two Hollywood movies offers in her kitty now!
Picked as a fashion model by Forest Essentials.
— JΛYΣƧΉ (@baldwhiner) May 20, 2023
పాపులర్ స్కిన్ బ్రాండ్ మలీషా ముఖాన్ని ఎంచుకుని ప్రచార పర్వాన్ని హోరెత్తించాలని నిర్ణయించడం ఆ బాలిక తలరాతను మార్చేసింది. ఫారెస్ట్ ఎసెన్షియల్స్ న్యూ క్యాంపెయిన్‌లో భాగంగా సెలెక్షన్స్‌లో మలీషా ఎంపికైంది. స్లమ్‌లో పుట్టిపెరిగిన మలీషా తన కలలు, ఆకాంక్షలకు రెక్కలు తొడిగిన తీరుతో తమ బ్రాండ్ ఫేస్‌గా మలీషాను ప్రవేశపెడుతున్నామని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోలో 14 ఏండ్ల మలీషా తన పోస్టర్‌తో ఉన్న స్టోర్‌ను సందర్శించి మురిసిపోవడం కనిపిస్తుంది. ఈ క్లిప్ ట్వి్ట్టర్లో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 1.8 లక్షల మంది వీక్షించగా పెద్దసంఖ్యలో యూజర్లు బాలికను అభినందనల్లో ముంచెత్తారు. ఈ వీడియోలో మలీషా సంతోషాన్ని అసలు మిస్ కాకూడదని పలువురు యూజర్లు కామెంట్ చేశారు. ఇక రెండు హాలీవుడ్ మూవీ ఆఫర్లూ మలీషా తలుపు తట్టాయి.
Read More
Train misses station halt | స్టేషన్లో ఆగని రైలు.. సుమారు కిలోమీటరు వెనక్కి నడిపిన లోకో పైలట్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Girl
- Mumbai
- Slum
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

