కాచిగూడ : ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) స్పష్టమైన ప్రకటన చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య (R. Krishnaiah) డిమాండ్ చేశారు. జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం కాచిగూడలో 13 బీసీ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీ ప్రజల్లో ఉన్న రిజర్వేషన్ల (Reservations) అపోహాలు, బీజీపీ పార్టీపై ఉన్న మచ్చ తొలగిపోవాలంటే ప్రభుత్వం చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. బీజేపీ(BJP) పార్టీ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తివేయాలని కుట్ర పన్నుతుందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సమాదానాలు చెప్పాలని కోరారు.
రిజర్వేషన్లపై వైఖరిని వెల్లడించకపోతే బీసీలంత కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్‌కుమార్, నీల వెంకటేశ్, నందగోపాల్, వేముల రామకృష్ణ, ఉదయ్, రాజ్‌కుమార్,రమాదేవి, శివ, ప్రవీణ్,జ్యోతి పాల్గొన్నారు.