MI vs KKR | ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ రెండో వికెట్ కోల్పోయింది. ముంబై కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా తొలి ఓవర్లోనే ఫస్ట్ వికెట్ కోల్పోయిన కోల్కతా.. మూడో ఓవర్లో రెండో వికెట్ను కూడా కోల్పోయింది. తుషారా వేసిన మూడో ఓవర్లో రెండో బంతికి రఘువంశీ క్యాచ్ ఔటయ్యాడు.
ఇక తొలి ఓవర్లో 14 పరుగులు చేసిన కోల్కతా.. బుమ్రా బౌలింగ్ వేసిన రెండో ఓవర్లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేసింది.