Train misses station halt | స్టేషన్లో ఆగని రైలు.. సుమారు కిలోమీటరు వెనక్కి నడిపిన లోకో పైలట్
Train misses station halt | ఒక రైలు స్టేషన్లో ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో ఆ స్టేషన్ వద్ద వేచి ఉన్న ప్రయాణికులు షాక్ అయ్యారు. (Train misses station halt) అయితే పొరపాటును గ్రహించిన లోకో పైలట్ సుమారు కిలోమీటరు దూరం వరకు ఆ రైలును వెనక్కి నడిపాడు.
తిరువనంతపురం: ఒక రైలు స్టేషన్లో ఆగకుండా వెళ్లిపోయింది (Train misses station halt) . దీంతో ఆ స్టేషన్ వద్ద వేచి ఉన్న ప్రయాణికులు షాక్ అయ్యారు.అయితే పొరపాటును గ్రహించిన లోకో పైలట్ సుమారు కిలోమీటరు దూరం వరకు ఆ రైలును వెనక్కి నడిపాడు. దీంతో ఆ స్టేషన్‌కు రైలు చేరడంతో ప్రయాణికులు అందులోకి ఎక్కారు. కేరళలోని అలప్పుజ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. షోరనూర్‌కు వెళ్లే వేనాడ్ ఎక్స్‌ప్రెస్ రైలు సోమవారం ఉదయం 7.45 గంటలకు చెరియనాడ్ అనే చిన్న రైల్వే స్టేషన్లో ఆగాల్సి ఉంది. అయితే లోకో పైలట్ రైలును ఆ స్టేషన్లో నిలుపలేదు. సుమారు 700 మీటర్ల దూరం వెళ్లిన తర్వాత జరిగిన పొరపాటును లోకో పైలట్ గుర్తించాడు. ఆ రైలును రివర్స్‌లో నడిపి స్టేషన్ వద్దకు చేర్చాడు. దీంతో ఆ రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికులు అందులోకి ఎక్కారు.
కాగా, చిన్న రైల్వే స్టేషన్ చెరియనాడ్కు స్టేషన్ మాస్టర్ లేడని, అలాగే ఎలాంటి సిగ్నల్ కూడా అక్కడ లేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ స్టేషన్లో రైలు ఆపడంలో లోకో పైలట్ పొరపడినట్లు చెప్పారు. అయితే దీనిని వెంటనే గ్రహించి రైలును వెనక్కి నడిపి స్టేషన్ వద్దకు చేర్చినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఎవరూ కూడా ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదని తెలిపారు. అలాగే ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఆ రైలు సకాలంలో గమ్యస్థానానికి చేరిందని రైల్వే అధికారులు చెప్పారు. అయినప్పటికీ ఆ స్టేషన్ వద్ద రైలును నిలుపని లోకో పైలట్ల నుంచి వివరణ కోరుతామని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Kerala
- Loco Pilot
- misses
- reverses
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

