జమ్ము-కశ్మీర్: కశ్మీర్లో భద్రతా దళాల కాల్పుల్లో శుక్రవారం నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్పారా జిల్లా మచ్చల్ సెక్టార్లో పెద్దయెత్తున ఉగ్రవాదులు భారత్లోకి చొరబడుతున్నారన్న సమాచారం మేరకు ఆర్మీ, పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి.
‘ఆర్మీతో నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో నలుగురు పాక్ ఉగ్రవాదులు ఎదురు కాల్పుల్లో మృతి చెందారు’ అని కశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు.