VS Achuthanandan : కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ (VS Achuthanandan) కన్నుమూశారు. కమ్యూనిస్ట్ కురువృద్ధిగా పేరొందిన ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. సీపీఐ (ఎం) వెటరన్ నాయకుడైన అచ్చుతానందన్ గుండె సంబంధిత సమస్యలతో101 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచి వెశారు. జూన్ 23న గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు.
అచ్యుతానందన్ 1923 అక్టోబర్ 20న అలప్పుజాలోని పున్నప్రాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనపై కమ్యూనిస్ట్ భావాజాలం ప్రభావం పడింది. స్వాతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్ట్ నాయకుడు వీకే కరుణాకరన్ ప్రసంగాలు ఆయనను ప్రజాపోరాటల వైపు, కార్మికుల హక్కుల కోసం నినదించేలా చేశాయి. 1964లో సీఎఐ నుంచి బయటికొచ్చిన 32 మందిల్లో అచ్యుతానందన్ ఒకరు. అనంతరం..మూడేళ్లకు అంబలప్పుజా నుంచి శాసన సభ్యునిగా గెలుపొందిన ఆయన ఉద్యమ సహచరిణి కే వసుమతిని వివాహం చేసుకున్నారు.
We salute Comrade V.S. Achuthanandan—an architect of Kerala’s progressive journey, a voice of the voiceless, and a lifelong champion of the working class. pic.twitter.com/yMoKchefMa
— CPI(M) Kerala (@CPIMKerala) July 21, 2025
కేరళ రాజీకీయాల్లో అచ్యుతానందన్ ప్రస్ధానం మరువలేనిది. పద్దెనిమిదేళ్లు నిండక ముందు నుంచే క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు అచ్యుతానందన్. 44 ఏళ్ల వయసులో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజాకర్షణ నేతగా ఎదిగిన ఆయన 2006లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికి ఆయనకు 82 ఏళ్లు. 2011 అనంతరం మూడు పర్యాయాలు విపక్ష నేతగానూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారీ సీపీఎం నేత. ఆయనకు 2019లో చిన్నగా స్ట్రోక్ వచ్చింది. అయినా సరే ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా ప్రజల కోసం పోరాడారు.