దేవరకొండ రూరల్, జూలై 21 : దేవరకొండ మండలంలోని పాలత్యతండాకు చెందిన సతీశ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలిసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నేనావత్ కిషన్‌నాయక్ ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన ఇచ్చిన రూ.10 వేలను అనుచరులు సోమవారం సతీశ్‌కు అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని, అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నేనావత్ లక్ష్మణ్ నాయక్, రామావత్ శ్రీను, నరేశ్, నాగ పాల్గొన్నారు.