Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 25వేల ఎగువన ముగిసింది. ఆటో, రియాల్టీ, మెటల్, ప్రైవేట్ బ్యాంకుల షేర్లు రాణించడంతో లాభపడ్డాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,918.53 పాయింట్ల వద్ద సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత సెన్సెక్స్ కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్నది. చివరలో కొనుగోళ్లతో లాభపడింది. ఇంట్రాడేలో 81,518.66 కనిష్టానికి చేరిన సెన్సెక్స్.. గరిష్టంగా 82,274.03 పాయింట్ల మార్క్‌ను తాకింది. చివరకు 442.62 పాయింట్లు పెరిగి.. 82,200.34 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 122.30 పాయింట్లు పెరిగి 25,090.70 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరగ్గా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది. రంగాలవారీగా చూస్తే ఆటో, క్యాపిటల్ గూడ్స్, ప్రైవేట్ బ్యాంక్, పవర్, రియాల్టీ, మెటల్ 0.5-1 శాతం పెరిగాయి.
ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ 0.4-1 శాతం పతనమయ్యాయి. నిఫ్టీలో ఎటర్నల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎం అండ్ ఎం లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, హెచ్‌సీ ఎల్ టెక్, ఐషర్ మోటార్స్ నష్టపోయాయి. చైనా సంస్థ తిలక్‌నగర్ ఇండస్ట్రీస్‌తో బైండింగ్ టర్మ్ షీట్‌పై ఒప్పందం చేయడంతో బీఎల్డబ్ల్యూ ఆరు నెలల్లో గరిష్టానికి చేరాయి. ఎంఆర్‌పీఎల్ షార్స్ క్యూ1లో నష్టాల నేపథ్యంలో 6.6 శాతం పడిపోయింది. క్యూ1 లాభాలను చూపించినా ఏయూ స్మాల్ ఫైనాన్ బ్యాంక్స్ షేర్లు 5శాతానికిపైగా క్షీణించాయి.
ఆర్వీఎన్ఎల్ నుంచి ఆర్డర్‌ను అందుకున్న ఐఆర్కాన్ ఇంటర్నేషనల్ షేర్లు 2 శాతం పెరిగాయి. మాస్టెక్ షేర్లు 7 శాతం పెరిగాయి. బంధన్ బ్యాంక్ షేర్లు క్యూ1 లాభం 65శాతం తగ్గడంతో 2.5 శాతం పడిపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు వన్-టైమ్ లాభంతో 3 శాతం తగ్గాయి. బీఎస్ఈలో 150కి పైగా స్టాక్‌లు 52 వారాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఇందులో యూటీఐ, ఏఎంసీ, యూపీఎల్, ఆటమ్ ఇన్వెస్ట్మెంట్, దాల్మియా భారత్, ఆధార్ హౌసింగ్, ముత్తూట్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఈఐడీ ప్యారీ, హెచ్డీఎఫ్సీ, విశాల్ మెగా మార్ట్, చోళమండలం ఫైనాన్షియల్ హోల్డింగ్స్ ఉన్నాయి.