Orange Juice | నారింజ పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. ఈ పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. చాలా మంది కేవలం జ్వరం వచ్చినప్పుడు మాత్రమే ఈ పండ్లను తింటారు. కానీ వాస్తవానికి ఈ పండ్లను మనం రోజూ తినాలి. అప్పుడే పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అయితే రోజూ పండ్లను తినడం కష్టంగా ఉందని భావించేవారు లేదా సమయం లేదని అనుకునేవారు నారింజ పండ్లను జ్యూస్‌లా తయారు చేసి స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని రోజూ ఒక కప్పు మోతాదులో అయినా తాగుతుండాలి. ఇలా నారింజ పండ్ల రసాన్ని రోజూ తాగితే అనేక లాభాలు కలుగుతాయి. 200 ఎంఎల్ మోతాదులో ఈ రసం తాగితే 110 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇందులో సహజసిద్ధమైన చక్కెరలు 21 గ్రాములు, ప్రోటీన్లు 2 గ్రాములు, ఫైబర్ 1 గ్రాము ఉంటాచి.
నారింజ పండ్ల రసంలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోజుకు మనకు కావల్సిన విటమిన్ సిని 100 శాతం అందిస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మాదిరిగా కూడా పనిచేస్తుంది. ఈ జ్యూస్‌లో విటమిన్ బి9, పొటాషియం, మెగ్నిషియం, ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. ఈ జ్యూస్‌లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీంతో తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి. దీంతో రోగాలు తగ్గుతాయి. ముఖ్యంగా సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు.
నారింజ పండ్ల జ్యూస్‌లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి, అంతర్గత వాపులు తగ్గుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. నారింజ పండ్ల రసంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని తగ్గిస్తుంది. హైబీపీ ఉన్నవారికి ఈ జ్యూస్ ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని తాగడం వల్ల రక్త నాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె పనితీరు మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు.
నారింజ పండ్ల జ్యూస్‌ను రోజూ సేవిస్తుంటే కిడ్నీల్లో ఉండే రాళ్లు కరిగిపోతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. మూత్రం పీహెచ్ విలువ సమ స్థాయిలో ఉంటుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు సైతం తగ్గుతాయి. మూత్రం ధారాళంగా వస్తుంది. నారింజ పండ్ల రసంలో ఉండే విటమిన్ సి వల్ల మన శరీరం మనం తిన్న ఆహారంలో ఉండే ఐరన్‌ను అధికంగా శోషించుకుంటుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. రక్తం తయారవుతుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ జ్యూస్‌ను తాగుతుంటే శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. శరీరం ఉత్తేజంగా ఉంటుంది. యాక్టివ్‌గా పనిచేస్తారు, చురుగ్గా ఉంటారు. రోజంతా శక్తి స్థాయిలు అలాగే ఉంటాయి. నీరసం, అలసట తగ్గుతాయి. ఇలా నారింజ పండ్ల రసాన్ని రోజూ తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.