Champai Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం (JMM) మాజీ నేత చంపై సోరెన్ (Champai Soren) భారతీయ జనతా పార్టీలో చేరారు. శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) సమక్షంలో కమలం పార్టీలో చేరారు. చంపై సోరెన్‌కు జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ వర్మ తదితరులు హాజరయ్యారు.
కాగా, సొంతపార్టీపై చంపై సోరెన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. జేఎంఎంకు ఇటీవలే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు లేఖ విడుదల చేశారు. ఆ తర్వాత తాను బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని అన్నారు. గిరిజనుల సంక్షేమంతో పాటు జార్ఖండ్ ప్రజల అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. బంగ్లాదేశ్ చొరబాట్లతో ప్రమాదంలో పడిన గిరిజనులకు బాసటగా నిలుస్తామని స్పష్టం చేశారు. తాను ఎంతో కష్టపడి ఈస్ధాయికి చేరుకున్నానని, జార్ఖండ్ అభివృద్ధితో పాటు గిరిజనుల ఉనికిని కాపాడేందుకే తాను కాషాయ పార్టీలో చేరుతున్నానని చంపై సోరెన్ వెల్లడించారు.
#WATCH | Ranchi: Former Jharkhand CM and ex-JMM leader Champai Soren joins BJP in the presence of Union Minister Shivraj Singh Chouhan, Assam CM Himanta Biswa Sarma and Jharkhand BJP President Babulal Marandi. pic.twitter.com/iucd87XJmW
— ANI (@ANI) August 30, 2024
Also Read..
Jaishankar | చర్చలు జరిపే కాలం ముగిసింది.. పాక్ చర్యకు తప్పకుండా ప్రతిచర్య ఉంటుంది : జైశంకర్
Rahul Gandhi | కంగన చేతిలో ఓడిపోయిన అభ్యర్థికి.. రాహుల్ కంటే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిన కాంగ్రెస్..!
Ramdas Soren | చంపై స్థానంలో.. రాష్ట్ర మంత్రిగా రామదాస్ సోరెన్ ప్రమాణం