Jaishankar | చర్చలు జరిపే కాలం ముగిసింది.. పాక్ చర్యకు తప్పకుండా ప్రతిచర్య ఉంటుంది : జైశంకర్
Jaishankar | దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) విషయంలో భారత్ వైఖరిపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంతో చర్చలు జరిపే కాలం ముగిసిందన్నారు.
Jaishankar | దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) విషయంలో భారత్ వైఖరిపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంతో చర్చలు జరిపే కాలం ముగిసిందన్నారు. ఇకమీదట సానుకూలమైనా ప్రతికూలమైనా పాక్ నుంచి వచ్చే చర్యకు తప్పకుండా ప్రతిచర్య ఉంటుందని స్పష్టంచేశారు.
శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్.. పాకిస్థాన్ అంశాన్ని ప్రస్తావించారు. పాకిస్థాన్ మనతో ఎలా వ్యవహరిస్తే.. మనమూ అందుకు తగిన విధంగా బదులిస్తామని స్పష్టం చేశారు. ‘పాకిస్థాన్‌తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసింది. మన దేశం పట్ల పాకిస్థాన్ ఎలా వ్యవహరిస్తే.. మనం కూడా అందుకు తగిన విధంగా బదులిస్తాం. పాక్ నుంచి వచ్చే చర్య సానుకూలమైనా ప్రతికూలమైనా తప్పకుండా ప్రతిచర్య ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా భారత్ ముందడుగు వేస్తుంది’ అని జై శంకర్ స్పష్టం చేశారు.
ఇక ఇదే కార్యక్రమంలో ఉగ్రవాద కార్యకలాపాలపై (terror activities) కూడా జైశంకర్ స్పందించారు. పాకిస్థాన్ చేపడుతున్న ఉగ్రవాద చర్యలకు తగిన పరిణామాలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు. ఇటీవలే జమ్మూ లోయలో వరుసగా జరుగుతున్న ఉగ్రదాడులతో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు అస్థిరంగా మారాయన్నారు. ప్రధాని మోదీ ఈ విషయంలో వెనక్కి తగ్గరని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు ఓ ముగిసిన కథ అని జైశంకర్ పేర్కొన్నారు.
ఇక పొరుగు దేశం బంగ్లాలోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు జై శంకర్ వెల్లడించారు. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమయానుగుణంగా వ్యవహరిస్తామని తెలిపారు. పొరుగుదేశాలతో సమస్యలు ఉండని దేశమంటూ ఏదీ లేదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. దేశాల మధ్య పరస్పర సహాయ, సహకారాలు అందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. కొత్తగా ఏర్పాటైన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం కూడా భారత్‌తో సత్సంబంధాలు కలిగి ఉంటుందని జై శంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read..
Rahul Gandhi | కంగన చేతిలో ఓడిపోయిన అభ్యర్థికి.. రాహుల్ కంటే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిన కాంగ్రెస్..!
Rajnath Singh | రాష్ట్రాలు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు.. కోల్‌కతా ఘటనపై రాజ్‌నాథ్ సింగ్ స్పందన
Hand Casting | ప్రాణంగా ప్రేమించిన భార్య అనారోగ్యంతో మృతి.. భర్త ఏం చేశాడో తెలుసా..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

