Satyapal Malik | జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ (Former Jammu Kashmir Governor), బీజేపీ సీనియర్ నాయకుడు సత్యపాల్ మాలిక్ (Satyapal Malik) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో (prolonged illness) బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి (Ram Manohar Lohia Hospital)లో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 వరకు జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా ఆయన పనిచేశారు. ఆయన జమ్ము కశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే ఆర్టికల్ 370 రద్దు జరిగింది. ఆ తర్వాత ఆయన గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. తర్వాత అక్టోబర్ 2022 వరకూ మేఘాలయ గవర్నర్‌గా పని చేశారు. సత్యపాల్ మాలిక్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కిష్టార్‌లోని కిరు జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రం టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, ప్రాజెక్టు సివిల్ వర్క్స్ కోసం పటేల్ ఇంజినీరింగ్ సంస్థకు చెందిన ఫైల్‌ను ఆమోదించేందుకు రూ.300 కోట్లు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సత్యపాల్ మాలిక్‌పై సీబీఐ చార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది.
Also Read..
Tesla | టెస్లా సెకెండ్ షోరూం ప్రారంభానికి రంగం సిద్ధం.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా..?
Amit Shah | హోంమంత్రిగా అమిత్‌షా అరుదైన ఘనత.. ఎల్కే అద్వానీ రికార్డు బద్దలు
PM Modi: ఆపరేషన్ సింధూర్ సక్సెస్.. ప్రధాని మోదీని సన్మానించిన ఎన్డీఏ ఎంపీలు