న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఇవాళ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీని సత్కరించారు. ఆపరేషన్ సింధూర్‌తో విజయం సాధించినందుకు.. ప్రధాని మోదీని సన్మానించారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ .. ప్రధాని మెడలో పూలమాల వేశారు. హర హర మహాదేవ్ అంటూ ఎన్డీఏ ఎంపీలు నినాదాలు చేశారు. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ తర్వాత తొలిసారి ఎన్డీఏ కూటమి ఎంపీలు భేటీ అయ్యారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తీరు, ప్రతిపక్షాలు వ్యవహారశైలిపై కూడా ఆ భేటీలో చర్చించారు. పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత.. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాక్‌లో ఉన్న ఉగ్రస్థావరాలను ఆ ఆపరేషన్ ద్వారా పేల్చేశారు. వందల సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చారు. ఆ తర్వాత పెహల్గామ్ ఉగ్రదాడికి ప్లాన్ వేసిన సూత్రధారుల్ని ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా హతమార్చిన విషయం తెలిసిందే.
#WATCH | Delhi: PM Narendra Modi was welcomed and felicitated with a thunderous applause amid chants of ‘Har Har Mahadev’, after the success of Operation Sindoor and Operation Mahadev, at the NDA Parliamentary Party Meeting. pic.twitter.com/DO4SjNPOAh
— ANI (@ANI) August 5, 2025