Tesla | టెస్లా సెకెండ్ షోరూం ప్రారంభానికి రంగం సిద్ధం.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా..?
Tesla | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం (electric cars) టెస్లా (Tesla) అధికారికంగా భారత విపణిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
Tesla | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం (electric cars) టెస్లా (Tesla) అధికారికంగా భారత విపణిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గత నెల 15న ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూంను ప్రారంభించింది. ఇప్పుడు రెండో షోరూం ప్రారంభించేందుకు టెస్లా సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో తన సెకెండ్ షోరూంను తెరవబోతోంది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో గల ఏరోసిటీ (Aerocity)లో టెస్లా సెకెండ్ షోరూంను ఆగస్టు 11న ఓపెన్ చేయనుంది.
ఇందుకోసం వరల్డ్‌మార్క్ కాంప్లెక్స్‌లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని టెస్లా సంస్థ లీజుకు తీసుకున్నట్లు తెలిసింది. పార్కింగ్ సౌకర్యాలుగల ఈ షోరూమ్ స్పేస్‌కుగాను నెలకు రూ.25 లక్షలు అద్దె చెల్లించేలా కంపెనీ ప్రమోటర్, బిలియనీర్ ఎలాన్ మస్క్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది.
‘Y’ మోడల్ కార్ల అమ్మకాలు..
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక అమ్మకాలతో రికార్డు నెలకొల్పిన ‘వై’ మోడల్ కార్లను (Tesla Y Model) భారత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది టెస్లా. RWD (రియర్-వీల్ డ్రైవ్), లాంగ్-రేంజ్ RWD వేరియంట్ కార్లను అమ్మకానికి ఉంచింది. ఇక ధర విషయానికొస్తే రియర్-వీల్ డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు, లాంగ్-రేంజ్ ఆర్డబ్ల్యూడీ వేరియంట్ ధరను రూ. 67.89 లక్షలుగా నిర్ణయించింది. వీటి ‘ఆన్ రోడ్’ ధరల్ని పరిశీలిస్తే RWD వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 61.07 లక్షలుకాగా, లాంగ్-రేంజ్ వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 69.15 లక్షలుగా ఉంది. టెస్లా అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఇందులో 18 శాతం జీఎస్టీతో సహా రూ. 50,000 అడ్మినిస్ట్రేషన్, సర్వీస్ ఫీజు కూడా ఉంటుంది.
ఈ వాహనాలు చైనాలోని టెస్లా షాంఘై గిగాఫ్యాక్టరీ నుంచి దిగుమతయ్యాయి. ఈ వై మోడల్ వేరియంట్ ధరలు అమెరికాలో 44,990 డాలర్లు (భారత కరెన్సీలో రూ.38.63 లక్షలు), చైనాలో 2,63,500 యువాన్ (రూ.31.57 లక్షలు), జర్మనీలో 45,970 యూరోలు (రూ.46.09 లక్షలు)గా ఉన్నాయి. వీటితో పోలిస్తే భారత్‌లోనే ఈ వై మోడల్ ధరలు అధికం కావడం గమనార్హం. దిగుమతి సుంకం, లాజిస్టిక్స్ ఖర్చులే ధర పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
Also Read..
Amit Shah | హోంమంత్రిగా అమిత్‌షా అరుదైన ఘనత.. ఎల్కే అద్వానీ రికార్డు బద్దలు
Anil Ambani | 17 వేల కోట్ల రుణ మోసం.. ఈడీ ముందు విచారణకు హాజరైన అనిల్ అంబానీ
Kamal Hasan | సనాతన ధర్మం సంకెళ్లను తెంచుకోవడానికి ఉన్న ఏకైక ఆయుధం విద్య : కమల్ హాసన్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

